ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

584చూసినవారు
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఐజీ గ్రూపుల్లో తలా 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా విద్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్