అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండల కేంద్రంలోని 99 క్వార్టర్స్ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులకు అకస్మాత్తుగా ఆవు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిశిక సూర్యదేవ్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.