పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ

6చూసినవారు
పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ
పాడేరు మండలం బొక్కెళ్లు గ్రామంలో గిరిజన రైతులకు దశాబ్దాల కల నెరవేరింది. బుధవారం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ 43 మంది రైతులకు ఎటువంటి తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. భూ రికార్డుల్లో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్ల తప్పుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగంతో సమగ్ర పరిశీలన చేపట్టి తప్పులను సరిదిద్దించారు. రికార్డులు పూర్తిగా సరైనవని నిర్ధారించిన అనంతరం పాసుపుస్తకాలు ముద్రించి రైతులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్