ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తల్లి బిడ్డల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు
Jan 31, 2026, 15:01 IST/

తల్లి బిడ్డల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు

Jan 31, 2026, 15:01 IST
TG: మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెంగిచర్లకు చెందిన విజయ (35) తన ఇద్దరు పిల్లలు విశాల్(17), చేతన (18)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా చర్లపల్లి రైల్వే స్టేషన్ లో విజయ పార్క్ చేసిన కారులో సూసైడ్ లేఖ లభ్యమైంది. 'నా జీవితం నచ్చట్లేదు.. బతకాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. పిల్లల్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నాతో పాటే పిల్లలను తీసుకువెళ్తున్నా.. క్షమించు అమ్మా' అంటూ రాసి ఉన్నట్లు గుర్తించారు.