రేపు పాడేరులో రైతుల ప్రత్యేక గ్రీవెన్స్

30చూసినవారు
రేపు పాడేరులో రైతుల ప్రత్యేక గ్రీవెన్స్
పాడేరు కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు రైతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టుపరిశ్రమ తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు.