అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి, అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరంలోనూ 100 శాతం ఫీజు రాయితీని కొనసాగించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. గత మూడు విద్యా సంవత్సరాలుగా అమలులో ఉన్న ఈ రాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించాలని సూచించారు. ఈ అంశంపై పాఠశాలల స్పందనను సేకరించి, జూలై 10లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.