జి మాడుగుల: హైవే పనుల్లో నిర్లక్ష్యం, ప్రజలకు ఆరోగ్య సమస్యలు

10చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండల కేంద్రంలో నేషనల్ హైవే 516E రోడ్డు పనులు జరుగుతున్నాయి. పాడేరు నుండి జిమాడుగుల ప్రయాణం ప్రతిరోజు సాహసోపేతంగా మారుతోంది. హైవే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎప్పుడు ఎక్కడ రోడ్డు పనులు జరుగుతాయో హెచ్చరిక బోర్డులు కూడా లేవు. మండల కేంద్రంలో దుమ్ము ధూళితో వ్యాపారస్తులకు, ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. దుమ్ము లేవకుండా కనీసం వాటర్ సర్వీసింగ్ కూడా చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని ప్రజలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్