ప్రపంచానికి శాంతి, అహింస మార్గాన్ని చూపిన మహాత్మా గాంధీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం పాడేరులోని ఆమె స్వగృహంలో గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింస, సత్యం ఆయుధాలుగా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని విజయవంతం చేశారని, ఆయన చూపిన మార్గం చిరకాలం సజీవంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.