అల్లూరి సీతారామ రాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో జీసీసీ హమాలీలు తమ అక్టోబర్, నవంబర్ నెలల పెండింగ్ జీతాలు తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ముమ్మరం చేశారు. ప్రతినెల 5వ తేదీన జీతాలు జమ కావాల్సి ఉండగా, రెండు నెలలుగా ఆలస్యం కావడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు భారంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీసీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, జీతాలు జమ అయ్యేంత వరకు గోదాముల వద్ద పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. పెండింగ్ జీతాలు జమ అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని హమాలీ సెక్రటరీ రాజు తెలిపారు.