గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు ఆన్‌లైన్ హాజరు విధానాన్ని మినహాయించాలని గిరిజన సంఘం చింతపల్లి మండల కార్యదర్శి సాగిన
చిరంజీవి అధికారులను కోరారు. పశువులబంద, సత్యవరం గ్రామాల్లో ఉపాధి కూలీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతిక సమస్యల వల్ల ఆన్‌లైన్ హాజరు నమోదు కావడం లేదని, దీనివల్ల పనిదినాల నమోదు, వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు.