రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్ధులు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే నూరు శాతం ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. సోమవారం విద్యాశాఖ అధ్వర్యంలో స్థానిక ఒక పంక్షన్ హాలులో నిర్వహించిన పది, ఇంటర్మీడియత్ విద్యార్ధుల ప్రతిభా అవార్డుల పురస్కార ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.