అరకులోయ వైసిపి నేతలు బుధవారం జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఉపాధి హామీ కూలీల సమస్యలను వివరించారు. ఫేషియల్ అటెండెన్స్ విధానం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి, హాజరు నమోదు కాక వేతనాలు ఆలస్యమవుతున్నాయని, ఇది కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. పాత విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు.