రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి

815చూసినవారు
రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు గిరిజన గ్రామాల్లో నిలిచిపోయిన రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేయడం వల్ల గిరిజనులు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అత్యవసర పరిస్థితుల్లో కూడా డోలీలపై ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్