చింతపల్లి మండలం వాముగడ్డ కొత్తూరు గ్రామంలో శనివారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బి. సింహాచలం, ఎస్ఐ జి. వీరబాబు గ్రామస్తులకు గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని, పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల రక్షణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.