కొయ్యూరు మండలంలోని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే నింపి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని తహసీల్దార్ ప్రసాదరావు మంగళవారం సూచించారు. ఫారాలు సమర్పించని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారంలో తప్పనిసరిగా కలర్ ఫొటో, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్, తల్లిదండ్రుల పేర్లను నమోదు చేయాలని తెలిపారు. ఓటర్లంతా గడువులోపు ఫారాలు సమర్పించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు.