అల్లూరి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సెల్ టవర్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో, వర్షాకాలం ప్రారంభమైతే పనులకు ఆటంకం కలుగుతుందని, కాబట్టి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆమె సూచించారు. ఇప్పటికే అనుమతులు పొందినప్పటికీ నిర్మాణం పూర్తి కాని టవర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.