శుక్రవారం ఉదయం కొయ్యూరు మండలంలోని వలసంపేట గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా 516-ఈ జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో ఒక భారీ వృక్షం విరిగి పడింది. దీనితో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడటంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి అడ్డంగా పడిన వృక్షాన్ని తొలగించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.