చింతూరు మండలం కల్లేరు గ్రామ శివారులోని సీలేరు నది ఒడ్డున వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయస్సు గల గులాబీ రంగు టీ షర్టు బూడిద రంగు షార్ట్ ధరించి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిందని తెలిపారు. చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే క్రింద నెంబర్ కు తెలియజేయాలని (9182609596) కోరారు.