చింతపల్లి మండలంలోని బలపం పంచాయతీ పరిధిలోని మండిపల్లి, తోకపాడు గ్రామాలకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు దాటడం ప్రమాదకరంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు వినతులు అందించినా స్పందన కరువవడంతో, గ్రామస్తులు స్వయంగా శ్రమదానం చేసి కొండ ప్రాంతంలో మట్టి రహదారిని నిర్మించుకుంటున్నారు. శాశ్వత రహదారిని నిర్మించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.