దిగ్గజ టెక్ సంస్థల నుంచి వైజాగ్ కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్ అనుబంధ Raiden Infotech 87,520 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అత్యధిక FDI నమోదైంది. దీనితో పాటు TCS, సిఫీ కూడా తమ డేటా సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. అదానీ సంస్థ టెక్ పార్క్ (₹21,844 కోట్లు), మెటా అండర్సీ ప్రాజెక్టులు కూడా రానున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల డిజిటల్ ఇన్ఫ్రా మెరుగుపడటంతో పాటు యువతకు వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి.