మంగళవారం జి. మాడుగులలో 'మహిళా భద్రత – మన అందరి బాధ్యత' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లోకల్ కంప్లైంట్స్ కమిటీ చైర్‌పర్సన్ డా. కె. కృష్ణకుమారి మాట్లాడుతూ, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎస్‌ఐ బి. సాయిరాం పడాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు వారి హక్కులు, చట్టాల ద్వారా కల్పించిన రక్షణ, లైంగిక వేధింపుల నివారణ, ఫిర్యాదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.