ఉపాధి హామీ సమస్యలపై జేసీకి వైసీపీ వినతి

4చూసినవారు
ఉపాధి హామీ సమస్యలపై జేసీకి వైసీపీ వినతి
అరకులోయ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సోమవారం, 15 ఆగస్టు నాడు, జాయింట్ కలెక్టర్ శ్రీ పూజకు ఉపాధి హామీ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఫేషియల్ అటెండెన్స్ విధానం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి కూలీల హాజరు నమోదు కావడం లేదని, ఫలితంగా వేతనాలు నిలిచిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాత విధానాన్ని పునరుద్ధరించాలని, రోజువారీ వేతనాన్ని రూ. 600కు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్