అరట్లకోటలో స్వచ్ఛ పథం ప్రారంభం

3చూసినవారు
అరట్లకోటలో స్వచ్ఛ పథం ప్రారంభం
పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామంలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారుల ఇరువైపులా చెత్తాచెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్