దివ్యాంగుల దినోత్సవం: విద్యార్థులకు పోటీలు, బహుమతుల ప్రదానం

6చూసినవారు
కోటవురట్ల పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవిత కేంద్రంలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ ఉపాధ్యాయులు ముఖేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు సత్యాడ సుకుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల పట్ల వివక్షత వీడి, అందరితో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్