హిందూ సనాతన ధర్మం కనుమరుగయ్యే ప్రమాదం: లలిత్ కుమార్

0చూసినవారు
చత్రపతి యువసేన సంఘం ఆధ్వర్యంలో కోటవురట్ల తంగేడు కాటా వద్ద నిర్వహించిన హిందూ మహా సమ్మేళనంలో హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తంగేడు వినాయకుని, ఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించి, హిందుత్వాన్ని చాటి చెప్పారు. చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు విరాళాలు అందించిన దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సమారాధన కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్