మొంథా తుఫాను సమయంలో సముద్రతీర ప్రాంత మత్స్యకారులు, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన పాయకరావుపేట తహశీల్దారు ఎస్ఎ మహేశ్వరరావును రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద శాలువాతో సత్కరించి అభినందించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.