సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో పాయకరావుపేట శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె. మోనిష్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతను ఓబీసీ కేటగిరీలో 167వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 974వ ర్యాంక్ సాధించాడు. స్కూల్ లెవెల్ నుండి అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులు ఈ విజయాలు సాధిస్తున్నారని ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి తెలిపారు. ప్రతిభ కనబరిచిన మోనిష్ కుమార్ ను విద్యా సంస్థల అధినేత, సంయుక్త కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.