
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న AI2487 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశారు. అనంతరం భోపాల్‌కు దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.




