ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం: కోటవురట్ల లో అవగాహన ర్యాలీ

3చూసినవారు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకొని, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం, ఐసిటిసి కౌన్సిలర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి కోటవురట్ల కూడలి వరకు పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి హెచ్ఐవిపై నినాదాలు చేస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్