
సబ్బవరం; మొగలి పురంలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో ఆదివారం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే కుట్రలను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం గండి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది.





































