
త్వరలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం
AP: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేపల వేట నిషేధం సమయంలో ఏటా అందించే రూ.20 వేల ఆర్థిక సహాయం కోసం లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించింది. ఈ నెల 17వ తేదీ నుంచి అర్హుల వివరాలు సేకరించి, జాబితా సిద్ధం చేసి, నిధులు విడుదల చేయనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని మత్స్యశాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రమాద బీమా పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.




