విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, పెందుర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలగకుండా, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.