విశాఖ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు ఎం. అభిషిక్త్ కిశోర్ బుధవారం ఉదయం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దైవ దర్శనం అనంతరం ఆయన కలెక్టరేట్‌కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.