కైలాసగిరిపై కొత్త రోప్ వే నిర్మించనున్నట్లు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ప్రస్తుత రోప్ వే పాతదిగా మారినందున, తక్కువ ప్రయాణ వ్యవధి ఉన్న దానిని బదులుగా సుమారు 1.5 కిలోమీటర్ల పొడవుతో కొత్త మార్గంలో రోప్ వే ప్రతిపాదించామని చెప్పారు. దీని ద్వారా బే ఫ్రంట్, విశాఖ నగరం, కొండల దృశ్యాలు త్రీ డైమెన్షనల్ వ్యూలో కనిపిస్తాయి. ఇది కార్ పార్కింగ్, ఇతర ప్రదేశాలతో అనుసంధానం అవుతుందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.