పెందుర్తి పరిధిలోని వేపగుంట బంటు కాలనీలో ఆదివారం ఒక ఆటో డ్రైవర్ తన కొడుకు బైకును తగలబెట్టిన ఘటన చోటుచేసుకుంది. కొడుకు కాలేజీకి వెళ్లడానికి బైక్ కావాలని అడగడంతో ఏడాది కిందట తండ్రి కష్టపడి కొనిచ్చారు. అయితే, కొడుకు స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తిరగడం, ట్రాఫిక్ చలానాలు ఎక్కువగా పడటం, ఇటీవల బైక్ ప్రమాదానికి గురవ్వడంతో, కొడుకు భవిష్యత్తుపై భయపడి తండ్రి ఈ చర్యకు పాల్పడ్డారు.