అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులోని జి.మాడుగుల మండలంలో గిరిజనులకు మాత్రమే భూమి కొనుక్కునే హక్కు ఉన్నప్పటికీ, గిరిజనేతరులు ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారని 17 పంచాయతీల పేసా గ్రామసభల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఆరోపించారు. డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ చట్టం 1994, పేసా యాక్ట్-1996 ప్రకారం పంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారని, వీటిని తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.