మా నాన్న డీజే వలన చనిపోలేదు: కుటుంబ సభ్యులు

2617చూసినవారు
పెందుర్తి మండలం పెదగాడిలో దసరా ఉత్సవాల్లో అప్పికొండ త్రినాథ్ డీజే సౌండ్ కారణంగా మృతి చెందారనే దుష్ప్రచారాన్ని ఆయన కుమారుడు కళ్యాణ్ ఖండించారు. త్రినాథ్ గుండెపోటుతోనే మరణించారని, పోలీసులు డీజేకు అనుమతి ఇవ్వలేదని, కేవలం రెండు స్పీకర్లతోనే అమ్మవారి ఊరేగింపు జరిగిందని కళ్యాణ్ తెలిపారు. తండ్రి డాన్స్ చేసిన 15 నిమిషాల తర్వాత కుప్పకూలిపోయాడని, ఆసుపత్రిలో వైద్యులు మృతిని ధృవీకరించారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్