పెందుర్తి: ఘనంగా ఏరువాక ఉత్సవం

17చూసినవారు
పెందుర్తి: ఘనంగా ఏరువాక ఉత్సవం
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కృష్ణాపురం గోశాలలో ఏరువాక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకట్రావు భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, నాగలితో భూమిని దున్ని విత్తనాలు చల్లి వ్యవసాయ పనులను ప్రారంభించారు. రైతే దేశానికి వెన్నెముక అని, జ్యేష్ఠ పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప సంప్రదాయమని ఈఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్