పెందుర్తి: లిఫ్ట్ కింద పడి యువకుడి మృతి

1చూసినవారు
పెందుర్తి: లిఫ్ట్ కింద పడి యువకుడి మృతి
పెందుర్తి పరిధిలో దమ్ము కార్తీక్ సాయి అనే యువకుడు లిఫ్ట్ కింద పడి మృతి చెందాడు. ఐటీఐ పూర్తి చేసి మెకానిక్ పనులు చేస్తున్న కార్తీక్ సాయిని, ఈశ్వరరావు అనే వ్యక్తి లిఫ్ట్ పనుల నిమిత్తం శనివారం తీసుకెళ్లాడు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ పనిచేస్తుండగా కార్తీక్ సాయి కింద పడిపోవడంతో మరణించాడు. పెందుర్తి ఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్