విశాఖ జిల్లా పెందుర్తిలోని ప్రశాంతి నగర్ సమీపంలో ఉన్న బాలాజీ నగర్ కాలనీ ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జలమయమైంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయి, ఇళ్లలోకి సైతం నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోందని, తమ సమస్యలను పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను కాలనీ ప్రజలు కోరుతున్నారు.