పెందుర్తి: చెరువులో శవమై తేలిన బాలుడు

6చూసినవారు
పెందుర్తి: చెరువులో శవమై తేలిన బాలుడు
పెందుర్తి పరిధిలోని సత్తివానిపాలెం చెరువులో బుధవారం సాయంత్రం ఆడుకుంటూ నీటిలో మునిగిపోయిన బాల ధర్మతేజ అనే బాలుడు గురువారం ఉదయం శవమై తేలాడు. కాపు జగ్గరాజుపేట ప్రాంతానికి చెందిన ఈ బాలుడు, మరో ముగ్గురు పిల్లలతో కలిసి చెరువు వద్దకు వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది. గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మృతదేహం చెరువులో తేలడంతో, పెందుర్తి పోలీసులు బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.