పెందుర్తి మండలం పొర్లుపాలెంలో ఆదివారం ఉదయం రైతుల నిరసనలో పాల్గొన్న రాపర్తి రామచంద్రరావు అనే రైతు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలోని భూములను రైల్వే విస్తరణ కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన తెలుపుతున్నారు. శిబిరం వద్ద నినాదాలు చేస్తున్న సమయంలోనే ఆయన కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.