పెందుర్తి : అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం

1630చూసినవారు
పెందుర్తి : అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సుజాతనగర్ శివాలయం పక్కనే ఉన్న శ్రీ గణేష్ నిలయం అపార్ట్మెంట్‌లోని రవిశంకర్ ఇంటిలో మంటలు వ్యాపించాయి. దీపావళి వేడుకలు ముగించి పక్క ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటే, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అగ్నిలో కరిగిపోయింది. అపార్ట్మెంట్లోని వాసులు వెంటనే పోలీసు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. వెలిగించిన దీపాలు ఈ ప్రమాదానికి కారణం అయ్యి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్