మంగళవారం సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.