విశాఖ శివారులోని అడివివరం బీసీ గురుకుల హాస్టల్‌లో ఎలుకలు విద్యార్థులను కరవడం కలకలం రేపుతోంది. గత నెల రోజుల్లోనే 10 మందికి పైగా విద్యార్థులు ఎలుకల కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి వేళల్లో ఎలుకల మధ్య నిద్రపోతూ నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.