పెందుర్తి: ‘స్వచ్ఛ పదం’ పక్కాగా అమలు కావాలి: జెడ్పీ సీఈఓ

673చూసినవారు
పెందుర్తి: ‘స్వచ్ఛ పదం’ పక్కాగా అమలు కావాలి: జెడ్పీ సీఈఓ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ పదం’ కార్యక్రమ అమలు తీరును జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) పి. నారాయణమూర్తి బుధవారం పెందుర్తి మండలం పినగాడి, రాజయ్యపేట గ్రామాల్లో పరిశీలించారు. చెత్త సేకరణ, కాలువల నిర్వహణను తనిఖీ చేసిన ఆయన, ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని, ప్రధాన రహదారులను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్