సబ్బవరం: ఉరేసుకొని విద్యార్థి మృతి

13చూసినవారు
సబ్బవరం: ఉరేసుకొని విద్యార్థి మృతి
సబ్బవరం మండలంలోని బీటీఆర్ డిఫెన్స్ అకాడమీలో గురువారం ఉదయం పత్తిపాటి వీరబాబు (19) అనే విద్యార్థి ఉరేసుకొని మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన వీరబాబు, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు. స్వగ్రామానికి వెళ్తానని ప్రిన్సిపల్‌కు సమాచారం ఇచ్చిన మరుసటి రోజు పీటీ క్లాస్‌కు హాజరు కాకపోవడంతో, తోటి విద్యార్థులు గదిలో అతని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి కువైట్లో ఉంటున్నారు.
Job Suitcase

Jobs near you