సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో భక్తులకు చందన ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రసాద కౌంటర్ల వద్ద విక్రయం ప్రారంభమవుతుంది. ఒక్క ప్యాకెట్ ధర రూ. 10గా నిర్ణయించగా, ప్రతి భక్తుడికి ఒక్క ప్యాకెట్ మాత్రమే ఇస్తారు. ప్రసాదం పొందేందుకు ఆధార్ కార్డు తీసుకురావాలని అధికారులు సూచించారు.