విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులపై ప్రత్యేక అవగాహన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అల్లంసెట్టి మోహన్ రావు, అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామల పాల్గొన్నారు. ఎల్‌నినో వల్ల కలిగే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. జూమ్ ద్వారా పాల్గొన్న ఈవీసీ విజయ్ కుమార్, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల రక్షణ, దిగుబడి స్థిరీకరణపై మార్గనిర్దేశం చేశారు.