చిన్నముసిడివాడలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెందుర్తి గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు హాజరయ్యారు. ఆదివాసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివాసీలకు డోలీ మోతలు లేని సమాజాన్ని ఇస్తామని హామీ ఇచ్చి రోడ్లు నిర్మించారని తెలిపారు.